రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన

6,8 తేదీల్లో భారీ బహిరంగ సభలు

విజయవాడ, మహానాడు: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకులు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, జనసేన నేత గౌతమ్‌, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ పర్యటన వివరాలను వెల్లడిరచారు. మే 6న రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని వేమవరం దగ్గర బహిరంగ సభ, అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని కసిమికోట మండలం ఊగినపాలెంలో బహిరంగ సభ, 8న రాజంపేట పార్లమెంటు పరిధిలోని కలికిరిలో బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలిపారు. కూటమి పార్లమెంట్‌ అభ్యర్థులు పురందేశ్వరి, సిఎం రమేష్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి విజయాన్ని కోరుతూ ప్రసంగిస్తారని వివరించారు. 8వ తేదీ సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు రోడ్‌ షోలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటారని వివరించారు.