హైదరాబాద్, మహానాడు: గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గార్లతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, విప్ బిర్లా ఐలయ్య, ఎంఎస్ ప్రభాకర్ రావు, లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, తదితరులు పాల్గొన్నారు.