Mahanaadu-Logo-PNG-Large

బండి సంజయ్‌ కుమార్‌ ప్రొఫైల్‌

పేరు: బండి సంజయ్‌ కుమార్‌
పుట్టిన తేదీ: 11-7-1971
తల్లిదండ్రులు: బండి నర్సయ్య-శకుంతల
అక్క : శైలజ
అన్నలు : బండి శ్రవణ్‌కుమార్‌
బండి సంపత్‌కుమార్‌
భార్య: బండి అపర్ణ(ఎస్‌బీఐ ఉద్యోగిని)
కుమారులు: సాయి భగీరథ్‌, సాయి సుముఖ్‌
మతం: హిందువు
కులము: మున్నూరుకాపు(బీసీ-‘డి’)

ప్రస్తుత బాధ్యతలు:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,
కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు.

గతంలో చేపట్టిన బాధ్యతలు:
– రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్- సేవకుడిగా..అఖిల్‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ లో పట్టణ కన్వీనర్‌, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు.
– ది కరీంనగర్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో రెండు పర్యాయాలు (1994-1999బీ 1999-2003) డైరెక్టర్‌గా పనిచేశారు.
– బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్‌చార్జ్‌
– భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షుడిగా, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.
– ఎల్‌.కె.అద్వానీ చేపట్టిన సురాజ్‌ రథయాత్రలో వెహికల్‌ ఇన్‌చార్జిగా..
– కరీంనగర్‌ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్‌ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా, రెండవసారి అదే 48వ డివిజన్‌ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్‌ విజయం సాధించారు.
– వరుసగా రెండుసార్లు కరీంనగర్‌ నగర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
– 2014 కరీంనగర్‌ అసెంబ్లీకి పోటీ 52 వేల పైచిలుకు ఓట్లతో ద్వితీయస్థానం
– 2019 కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా 66009 ఓట్లతో ద్వితీయస్థానం
– 2019 కరీంనగర్‌ ఎంపీగా 96 వేల మెజార్టీతో ఘనవిజయం
– 2019 ఓబీసీ వెల్ఫేర్‌ పార్లమెంట్‌ కమిటీ మెంబర్‌గా నియామకం
– 2019 అర్బన్‌ డెవలప్మెంట్‌ పార్లమెంట్‌ కమిటీ మెంబర్‌గా నియామకం
– 2019 టుబాకో బోర్డు మెంబర్‌గా నియామకం
– 2019 మైనారిటీ అఫైర్స్‌ స్టేట్‌ లెవెల్‌ కమిటీ మెంబర్‌గా నియామకం
– 2020 ఎయిమ్స్‌ బీబీనగర్‌ బోర్డు మెంబర్‌గా నియామకం
– 2020 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం
– 2023 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
– 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు.
– 2024 జాతీయ కిసాన్‌ మోర్చా ఇన్‌చార్జిగా నియామకం
– 2024 కరీంనగర్‌ ఎంపీగా 2.25 లక్షలకుపైగా మెజారిటీతో గెలుపు