టెక్ స్టార్టఫ్ లకు ఏఐ టూల్స్, మెంటార్ షిప్ అందించండి

– ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ శిక్షణ ఇవ్వండి
– సేల్స్ ఫోర్స్ సీఈవో క్లారా షిహ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ

లాస్ వెగాస్ (యుఎస్ఎ): సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిహ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లోని సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై మేం దృష్టిసారించాం. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకారం అందించండి. మా రాష్ట్రంలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తిని సిద్ధం చేయండి. సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యా సంస్థలతో భాగస్వాములు కండి. ఆంధ్రప్రదేశ్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్‌లకు ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించండి. టెక్ స్టార్టప్‌లలో నవీన ఆవిష్కరణల కోసం మీ వ్యవస్థాపక స్పూర్తి ఆంధ్రప్రదేశ్ ఆశయాలకు అనుగుణంగా ఉంది.

ఐన్ స్టీన్ ఏఐని ఆంధ్రాకు పరిచయం చేయండి
ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ ని మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ ఐన్‌స్టీన్ ఏఐని మా రాష్ట్రంలో పరిచయం చేయండి. ఏఐ – పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనారంగంలో సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు సహకారం అందించండి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజంను మెరుగుపర్చడం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్‌ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నాం. పరిపాలనలో ఏఐ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఏపీలో అమలయ్యే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగ మంత్రి లోకేష్ కోరారు.

నైతికతతో కూడిన ఏఐపై దృష్టి సారించాం
ఈ సందర్భంగా క్లారా షిహ్ మాట్లాడుతూ… సేల్స్ ఫోర్స్ ఏఐ వ్యూహ పర్యవేక్షణ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ (సిఆర్ఎం)లో ఆఫర్లను మెరుగుపర్చడం, ఏఐ అండ్‌ మిషన్ లెర్నింగ్ లో నవీన ఆవిష్కరణలపై మేం దృష్టి సారించాం. ఐన్‌స్టీన్ ఎఐ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి కి కసరత్తు చేస్తున్నాం. కస్టమర్ మనోభీష్టానికి అనుగుణంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యాపార విధుల్లో ఆటోమేషన్‌ కోసం ఎఐ టూల్స్‌ రూపొందించడం వంటి సేవలు అందిస్తున్నాం.

సేల్స్‌ఫోర్స్ ఏఐ సంస్థ నైతికతతో కూడిన కృత్రిమమేధపై దృష్టి సారిస్తుంది. ప్రభుత్వ రంగ ప్రాజెక్టులలో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి మేం కట్టుబడి ఉన్నాం. ఏఐ అండ్‌ ఎంఎల్ నవీన ఆవిష్కరణల్లో దూసుకుపోతున్న తమ సంస్థ ప్రస్తుతం $287 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉందని తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో మాట్లాడతానని క్లారా షిష్ పేర్కొన్నారు.