– మాజీ మంత్రి జవహర్
విజయవాడ, మహానాడు: ఏ ఆధారం లేకుండా ప్రజల్లో ఉన్న నాయకుణ్ణి అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని దానిని బ్లాక్ డే గా చూడాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ కోరారు. ప్రజా నాయకుడు, విజనరీ సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి సంవత్సరం అయిన సందర్భంగా జవహర్ మాట్లాడారు.
అరెస్ట్ అయిన దగ్గర నుండి బయటకు వచ్చేవరకూ ప్రజలు రోడ్డు పైనే ఉన్నారని, ప్రజా నాయకుడు కాబట్టే సుమారు డబ్భై దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఎంతమంది గుండెల్లో ఉన్నారో ప్రపంచం మొత్తానికి తెలిసింది కానీ సైకో రెడ్డికి తెలియలేదని విమర్శించారు. ఆ రోజు మద్దతిచ్చిన ప్రజలకు ఈ రోజు సేవ చేస్తున్నారు… ఇది కదా విజనరీ అంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో అర్ధరాత్రి రెండున్నరకి నీటిలో ప్రయాణిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూశారా? వరద ప్రభావిత ప్రాంతాల్లోనే తన ఆఫీస్ ను ఏర్పాటు చేసుకుని నిత్యం అధికారులను ఉరుకులు పెట్టిస్తూ మోనటరింగ్ చేసే వ్యక్తి ఏ రాష్ట్రానికైనా దొరుకుతాడా? ఈ విషయాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించాలని కోరారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గొప్పతనం సైకో రెడ్డి తెలుసుకుని మాట్లాడాలని జవహర్ హితవు పలికారు.