– గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 5ఏళ్ళ నుండి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారని, వీటిని అత్యవసరంగా గుర్తించి, పరిష్కార దిశగా మునిసిపల్ అధికారులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. గురువారం తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన మునిసిపల్ అధికారాలతో మాధవి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తన దృష్టికి వచ్చిన పలు ప్రజాసమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసరంగా పరిష్కారించాలని సూచించారు. అదేవిధముగా A.T అగ్రహారంలో 14వ లైన్ లో కలుషితనీరు సరఫరా అవుతుందని తనను ఈ రోజు కలిసిన ప్రజలు,తన దృష్టికి తీసుకొనివచ్చారన్నారు. గతంలో మున్సిపల్ మంచి నీటి లైన్లలో కలుషిత డ్రైనేజి కలిసి అనేకమంది ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యారని, దురదృష్టవశాత్తు కొంతమంది మరణించారని మాధవి గుర్తు చేసారు. ఇప్పుడు అలాంటి నిర్లక్ష్యాలు జరగటానికి వీలులేదని, వెంటనే దీనిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.