ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

– గణేశుని ఉత్సవాల్లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దొనకొండ, మహానాడు: నరసింహనాయునిపల్లె గ్రామంలో గురువారం రాత్రి గ్రామస్తుల ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గణేశుని ఉత్సవాలలో భాగంగా స్వామి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే స్వామివారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. తుపాను వంటి విపత్కర పరిస్థితులలో సైతం రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతటి సాహసం చేశారో అందరం చూసామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, ప్రజలందరూ ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు. గ్రామంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు, మహిళల ఆదరాభిమానాల నడుమ కోలాహలంగా లక్ష్మికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.