– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
బుక్కపట్నం, మహానాడు: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం, యదాలంక పల్లి, మారాల, పాముదుర్తి, గూనిపల్లి, సిద్దారాం పురం, జానకాం పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం లో ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ ను మరో 1000 లకు అదనంగా పెంచి రూ.4000 లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు.