చంద్రబాబు సీఎం కావాలని పూజలు

రాచకొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం
గుంటూరు అభ్యర్థుల గెలుపు కోసం మొక్కులు

గుంటూరు: చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ నగరం లోని 51వ డివిజన్‌లోని రాముల వారి సన్నిధిలో మంగళవారం టీడీపీ జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, 51 డివిజన్‌ కార్పొరేటర్‌ ముప్పవరపు భారతి పాల్గొన్నారు. ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్‌, పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవి, తూర్పు నుంచి నశిర్‌ అహ్మద్‌ గెలవాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు దయారత్నం, జిల్లా కార్యదర్శి మల్లంపూడి శ్రీనివాస రావు, రాష్ట్ర టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యదర్శి మహంకాళి నరసింహారావు, రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి బొంత ల సాయి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి కోక బాలాజీ, టీడీపీ జిల్లా బీసీ సీనియర్‌ నాయకులు జబ్బు సైదులు, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి జంపని నాగేశ్వరరావు పాల్గొన్నారు.