రైతుబంధు నిధులు విడుదల చేయాలి
అన్ని రకాల వడ్లకు బోనస్ అమలు
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీజేపీ నేతలు
హైదరాబాద్, మహానాడు : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ బీజేఏల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సచి వాలయంలో సీఎం రేవం త్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. తడిసిన ప్రతీ గింజ కొనాలని, రైతు బోనస్ అమలు చేయాలని కోరారు. రైతు రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని విన్నవించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని చెప్పగా అధికారులను పిలిచి ఆదేశాలు జారీ చేశారు.
రైతు సమస్యలపై వివరించాం
సీఎంను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మూడు నుంచి నాలుగు కిలోలు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు. కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. మిగిలిన రైతుబంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కేవలం రైతుల అంశాలను మాత్రమే కాకుండా ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. మా వినతులపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుం దని వెల్లడిరచారు.