విద్యాలయాల ప్రక్షాళన

– మంత్రి నారా లోకేష్‌

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం… పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం… రాష్ట్రంలోని వర్శిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఈ నెల 28వ తేదీ గడువుగా పెట్టామని ఆయన పేర్కొన్నారు.