– హైకోర్టు తీర్పు
అమరావతి, మహానాడు: మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని శనివారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ఎస్టీ కాదంటూ 2019లో హైకోర్టులో పిటిషన్ వేసిన నిమ్మక సింహాచలం, నిమ్మక జయరాజ్ లకు ఈ తీర్పుతో చుక్కెదురైట్లయింది. పిటిషనర్లు శ్రీవాణి ఎస్టీ కాదంటూ తమ ఆరోపణలను నిరూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ(కొండదొర) అని హైకోర్టు నిర్ధారించింది.
డీఎల్ సీ, జిల్లా కలెక్టర్ దర్యాప్తు నివేదికల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. పుష్ప శ్రీవాణి కుల ధ్రువీకరణ పత్రాలు సరైనవే అని తేల్చింది. పుష్ప శ్రీవాణి తండ్రి, సోదరి అందరూ ఎస్టీలే అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.