సేవా దృక్పథం కలిగిన వ్యక్తులను కమిటీలో వేసుకోండి

– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

తెనాలి, మహానాడు: ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్ డి ఎస్) లో సేవా దృక్పథం కలిగిన వ్యక్తులను చేర్చుకుంటే ఆసుపత్రి అభివృద్ధితోపాటు పేదలకు గొప్ప వైద్య సేవలు అందుతాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కమిటీకి సూచించారు. ఆసుపత్రి అధికారులతో మంత్రి శనివారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఆసుపత్రి నిర్వహణ బాగుంది. ప్రభుత్వ ఆసుపత్రికి ఏమి కావాలన్న తమ దృష్టికి తీసుకురావాలి.. తన వంతు సహాయం ఎంత వరకు చేయగలనో అంతా చేస్తాను. ఆసుపత్రిలో కొన్ని పరికరాలు కావాలని అధికారులు చెప్పారు. అవి మీరూ ప్రభుత్వం దృష్టిలో పెట్టండని, తాను కూడా తన ద్వారా దాతలు ద్వారా ఎంతవరకు తీసుకురాగాలనో అంతవరకు చేస్తా.. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల అంకితభావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారు. ఆసుపత్రికి తనవంతుగా ఉడతా భక్తి సాయం చేస్తా… మరొకసారి ఆసుపత్రిని సందర్శిస్తాను. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజయ్ సింహ, ఆసుపత్రికి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.