– మూడు నెలలల్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు 25 లక్షల రూపాయలకు పెంపు చేయడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది.
– అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు
– దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు
ధర్మవరం: దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేసి సుమారు 98 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేపడుతున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. పేర్కొన్నారు. శనివారం ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని తుంపర్తి గ్రామం నందు మన ఇల్లు- మన గౌరవం అనే కార్యక్రమం పై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా సంవత్సరానికి 22 లక్షల మందికి గృహ నిర్మాణంలో మంజూరు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇందుకు సుమారు 98 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
ఇందులో 32 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మిగిలినవి 40 శాతం రాష్ట్రం నిధులు ఖర్చు పెట్టాలని తెలిపారు, ఒకొక్కలబిదారుడికి సుమారు 1,80,000 ఇంటి నిర్మాణం కొరకు రూపాయలతో అందజేయడం జరిగింది, ప్రస్తుతం నిధులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల వేల కోట్లు అప్పు ఉన్నదని తెలిపారు. సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రధాన సమస్యలు అధిగమించి పేదల జీవితాలు వెలుగు నింపడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం! ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే ‘ఇది మంచి ప్రభుత్వం!’ అని ప్రజలతో అనిపించు కుంటోందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేదిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అందులో భాగంగా మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతున్న ప్రభుత్యం అన్నారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు.
ధర్మవరం పట్టణంలో అన్న క్యాంటీన్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్”ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇస్తున్నామని తెలిపారు. మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000లు చొప్పున ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు.
గ్రామ సచివాల ఉద్యోగస్తులు ద్వారా నిష్పక్ష పతంగా వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయుచున్నామని తెలిపారు. ఈ కాలనీకి త్వరలో చౌకు దుకాణ ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఈ కాలనీల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి సంబంధిత అధికారులను పర్యవేక్షణలో కార్యక్రమాలు శ్రీకారం చుట్టానని తెలిపారు, అంతకుమునుపు జి కళావతి భర్త జి మోహన్ వారి గృహ నిర్మాణాలకు మంత్రివర్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆదినారాయణ, రామాంజనేయులు రాజారెడ్డి చిట్టిబాబు, హౌసింగ్ పీడీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు