– స్వలాభం కోసం బీసీల ఆత్మ గౌరవంతో ఆటలాడతామంటే తాట తీస్తాం
– టిడిపి ఎమ్మెల్సీ బీటీ నాయుడు
ఐదేళ్ళుగా బడుగు బలహీన వర్గాలపై జగన్ రెడ్డి ఊచకోతను చూస్తూ కూడా జగన్ రెడ్డికి భజన చేస్తున్న ఆర్ కృష్ణయ్యకి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీలను అణగదొక్కి, దాడులు, హత్యలు చేస్తూ చరిత్రలో ఎన్నడూ చేయనంత ద్రోహం జగన్ రెడ్డి బీసీలకు చేశాడు. అయినా జగన్ రెడ్డికి వంత పాడటానికి ఆర్ కృష్ణయ్య సిగ్గు పడాలి. ఆర్ కృష్ణయ్య లాంటి చీడ పురుగులకు బీసీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. వందలాది మంది బీసీల ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి పంచన చేరినప్పుడే కృష్ణయ్య నీఛ బుధ్ధి ప్రజలకు అర్థమైంది. బీసీలపై దాడులు చూస్తూ కూడా నోరెత్తని నువ్వు నేడు జగన్ రెడ్డి సంఘ సంస్కర్త అనడం హాస్యంగా ఉంది. బీసీల కోసం పోరాడుతూనే ఉన్నానని గప్పాలు చెప్పుకోవడం కాదు, అమర్నాథ్ గౌడ్‌ని పెట్రోల్ పోసి తగలబెట్టినపుడు, తోట చంద్రయ్య పీక కోసి చంపినపుడు ఎక్కడున్నావ్? బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్‌ను రద్దు చేస్తుంటే ఏం చేశావు? సబ్ ప్లాన్, కార్పొరేషన్ నిర్వీర్యం చేసి, బీసీ యువత జీవితాలను చిత్తు చేసినపుడు ఎక్కడున్నావ్? తాడేపల్లి కొంపకు తాబెదారుగా వ్యవహరించే నీకు బీసీ అని చెప్పుకునే అర్హత కూడా లేదు. బీసీలకు ఏం న్యాయం జరిగిందని జగన్ రెడ్డికి ఓటు వేయాలి? జగన్ రెడ్డికి భజన చేయడానికి తప్ప బీసీల కోసం ఈ ఐదేళ్ళలో నువ్వు ఒక్క రోజైనా పోరాటం చేసావా? 139 జనరల్ స్థానాల్లో 49 స్థానాలు జగన్ రెడ్డి సొంత సామాజికవర్గానికి కేటాయించడమే సామాజిక న్యాయమా? బీసీల ఆత్మగౌరవాన్ని తాడేపల్లిలో తాకట్టు పెట్టిన నిన్ను నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరు. బీసీలను తెలుగుదేశం పార్టీ నుంచి విడదీయడం ఎవ్వరి తరం కాదు. మరో 53 రోజుల్లో జగన్ రెడ్డితో పాటు నీలాంటి బీసీ ద్రోహులను, బీసీ కార్డు వాడుకుని బీసీల జీవితాలను ఛిద్రం చేసిన చీడ పురుగుల్ని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టడం ఖాయం.