-జగన్ కళ్లలో కళ్లు పెట్టి చూసి పిచ్చి ముదిరింది
-అందుకే లండన్ వెళ్లాడేమో అంటూ వ్యాఖ్యలు
అమరావతి, మహానాడు: ‘‘ఆయనతో ఉండే సాన్నిహిత్యంతో ఒక విషయం మీతో పంచుకుంటా. ఎవరైనా జగనన్న ఆర్బిట్‌లోకి వచ్చి..ఈ డిస్టెన్స్‌లో(నాలుగైదు అడుగులు) ఆయన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు. ఈజ్ నాట్ ఎ మాన్, బట్ ఈజ్ యాన్ ఎమోషన్, ఈజ్ యాన్ ఎఫోరియా. ఆయన్ని చూస్తే పిచ్చి పట్టేస్తది. అతనొక ఎమోషన్, అతనొక శక్తి. అంతే’’! అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్‌లో వైసీపీ ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. అయితే దీనిపై రఘురామకృష్ణంరాజు వ్యంగ్యంగా స్పందించారు. జగన్‌ను కళ్లలో కళ్లు పెట్టి చూస్తే పిచ్చి పడుతుంది అంటున్నారు సుధా గారు. బాగా చూసి చూసి ఈయనకు పిచ్చి బాగా ముదిరినట్టే ఉంది. లండన్ ఈయన కూడా అందుకే వెళ్లా రు ఏమో? ఇంకా ఎమోషనా, కమోషనా, మోషనా అన్నది 4వ తేదీ చూద్దామం టూ వ్యాఖ్యానించారు.