Mahanaadu-Logo-PNG-Large

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంశం పైన రాహుల్ గాంధీ స్పందించాలి

ఎన్నికల ముందు తెలంగాణ యువతను కలిసి ఇచ్చిన హామీపైన రాహుల్ స్పందించాలి
తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ అంశం పైన స్పందించకపోవడంతో రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్

హైద‌రాబాద్‌: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు స్వయంగా తెలంగాణలోని యువతను నిరుద్యోగులను కలిసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ మేరకు అన్ని ప్రధాన పత్రికల్లో పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలను సైతం విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనల్లో తేదీలతో సహా ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే 7 నెలల సమయం గడిచిపోయిందని కానీ ఒక్క కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కాలేదని, అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 10 నోటిఫికేషన్ తేదీల గడువు ముగిసిపోయిందన్నారు.

ఇప్పటికే 7 నెలల కాలం గడిచిపోయిందని మరి మిగిలిన ఐదు నెలల కాలంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ విధంగా జారీ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన నాయకులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో బాధ్యత తీసుకొని స్పందించకపోవడం వల్లనే రాహుల్ గాంధీని ఈ విషయంలో ప్రశ్నిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, ఈ అంశం పైన రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.