ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది
మహిళలంటే సోనియా, ఇందిర అన్న భావనలోనే ఉన్నారు
వికసిత్ సంకల్ప్‌తో మోదీ వారి గౌరవం పెంచారు
బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్
విజయవాడ, మహానాడు : మహిళలను అత్యున్నత శిఖరాలకు చేర్చాలన్న అభిమతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని, కాంగ్రెస్ పార్టీ అనాదిగా మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలు స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా వారి జీవితాలను తీర్చిదిద్దడానికి ఎప్పుడు కూడా ముందుకు రాలేదని పేర్కొన్నారు. దేశంలో మహిళలు అంటే కేవలం సోనియాగాంధీ, ఇందిరాగాంధీ అనే మానసి క స్థితి నుంచి రాహుల్ గాంధీ బయటకు రావాలి. దాదాపు దేశంలో సగానికి పైగా ఉన్న మహిళలు నారీ శక్తిని గుర్తించడంలో ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
వికసిత్ సంకల్ప్‌తో మహిళలకు భాగస్వామ్యం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వప్నం వికసిత్ సంకల్ప్ భారత్ మహిళలను భాగస్వామ్యం చేయడం తన కర్తవ్యంగా భావించారు. గడిచిన తొమ్మిది సంవత్స రాల్లో స్వచ్ఛభారత్ ద్వారా దాదాపు 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల గౌరవాన్ని నిలిపారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా 5 కోట్ల పేదల స్వంత గృహ లబ్ధిదారులలో 70 శాతం మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిం చారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేద మహిళల పొదుపు పెరిగింది. పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా పొగబారిన పడి అనారోగ్యం పాలు కాకుండా కాపాడగలిగారు. కోటి మంది లాక్ పతి దీదీలను తయారు చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల ఆదరణ చొరగొన్నారు. 50 కోట్ల జన్‌ధన్ ఖాతాల ద్వారా 39 లక్షల కోట్ల నగదు బదిలీతో 60 శాతం పైగా మహిళలు లబ్ధి పొందారు. దేశంలో గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘన త ప్రధాని నరేంద్ర మోదీది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మహిళలను చట్ట సభలలో ప్రాతినిధ్యం కోసం 33.33 శాతం రిజర్వేషన్ తెచ్చారు.
రాహుల్ చరిత్ర తెలుసుకోవాలి
మరో వంక రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్ గురించి చాలా తెలివి తక్కువగా మాట్లా డుతున్నారు. వారి నాయనమ్మ ఇందిరా గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను, వీర సావర్కర్‌ను ఏ విధంగా ప్రశంసించిందో చరిత్రను చూసి తెలుసుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్ మహి ళలకు భాగస్వామ్యం లేదు అని రాహుల్ గాంధీ అనడం అతని అవివేకానికి అద్దం పడుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తి నారీ శక్తి. ఆర్‌ఎస్‌ఎస్ మహిళను భారత సాంప్రదాయంలో ఆది పరాశక్తిగా గౌరవంతో కూడిన స్వయం ప్రతిపత్తి వారికి కావాలని కోరుకుంటుంది. మహిళలను కేవలం ఇంటికి, వంటింటికి పరిమితం చేయాలనే కుసంస్కారం కొనసాగుతుంది.