ఏపీలో నాలుగురోజుల పాటు వర్షాలు

అమరావతి, మహానాడు: ఏపీలో ఒక వైపు ఎండలు మండిపోతూ ఉంటే వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభా వంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, ఈ నెల 10, 11వ తేదీల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.