తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

– ఐఎండీ హెచ్చరిక

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ( సెప్టెంబర్ 8) నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 08, 09, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడుతాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది.