హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.