రాళ్ల దాడిలో క్షతగాత్రులకు కన్నా పరామర్శ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : గత రాత్రి జరిగిన రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ముస్లింలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి పార్టీ ఎల్లప్పుడూ అండ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిం చాలని కోరారు. ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో గత రాత్రి జరిగిన వైసీపీ రౌడీ మూకల చేతిలో టీడీపీ కార్యకర్తలు గాయపడిన విషయం తెలిసిం దే. సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారంతా చికిత్స పొందుతు న్నారు. కన్నా వెంట కూటమి నాయకులు ఉన్నారు.