హైదరాబాద్: రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు అంతిమయాత్ర కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్ర బాబు పాల్గొన్నారు. రామోజీరావు పాడె మోశారు. అంత్యక్రియల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర రామోజీరావు మృతికి సంతాపం ప్రకటించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.