టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి
మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావుకు ఘన నివాళులర్పిం చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రామోజీరావు మృతి వ్యక్తిగతంగా చాలా కలచివేసింది. సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగి పట్టుదల, అంకితభావంతో నమ్మిన సిద్ధాం తం కోసం పనిచేశారని కొనియాడారు. సుదీర్ఘకాలంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదని, వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పెట్టారు. అయినా నిజాలను రాసి మళ్లీ రాష్ట్రాన్ని ఒక గౌరవ ప్రదమైన రాష్ట్రంగా తీసుకురావడానికి రామోజీరావు కృషి చేశారన్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో రామోజీరావు పటాలు పెట్టి నివాళులర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. పత్రికా రంగం, సినీరంగంలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. తెలుగుజాతికి ఆయన సేవలు మరువలేనివన్నారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విలువ లకు పట్టంకట్టి ఈటీవీ, ఈనాడు పత్రికలను ఏర్పాటు చేసి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపించిన రామోజీ మరణం తెలుగు జాతికి పూడ్చలేని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, ఎమ్మెల్యేలు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు లింగారెడ్డి, ఎ.వి.రమణ, దారనాయక్, ఆనంద్ సూర్యా, అఖిల్, హసన్‌బాషా, కృష్ణ, బుచ్చి రాంప్రసాద్, వద్దులూరి వెంకటేశ్వరరావు, శంకర్ నాయుడు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు పాల్గొన్నారు.