-అలుపెరుగని కృషీవలుడు రామోజీ రావు
– తెదేపా జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి
అలుపెరగని కృషి, పట్టుదల, అంకితభావం, ధృడదీక్ష, పోరాటపటిమ, ప్రజాస్వామ్య పరిరక్షణలకు రామోజీరావు పర్యాయపదం. వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం. తెలుగుభాష అభ్యున్నతికి ఎంతోగానో కృషిచేశారు. పాడుతా-తీయగా లాంటి కార్యక్రమాలతో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను వెలితీశారు. ప్రపంచంలోనే రెండవ స్థాయి కలిగిన ఫిల్మ్ సిటీని నిర్మించారు. మార్గదర్శి ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందించారు. అక్షరాస్యత ఉద్యమానికి ఈనాడు ఎంతగానో తోడ్పడింది. వ్యాపారంలో సమాజహితం చేసిన మహోన్నత వ్యక్తి. రామోజీ జీవితం భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. రామోజీ రావు స్మృతికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలి. రామోజీ రావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధన. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.