పొన్నూరు: అక్షర యోధుడు, నిరంతర శ్రామికుడు, దేనికి తలవంచని ధీశాలి, తెలుగువారు గర్వించదగ్గ దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగుజాతికి తీరని లోటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.