హైదరాబాద్: రామోజీరావు మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్‌బాబు సంతాపం తెలిపారు. దూరదృష్టి ఉన్న రామోజీరావు మరణవార్త తెలిసి చాలా బాధపడ్డా. రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న అభిరుచికి నిదర్శనం. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.