‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షించాలి’

మచిలీపట్నం, మహానాడు: స్థానిక గుమస్తాల కాలనీలో నివాసముంటున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంతో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

బాలిక కు సంబంధించి తల్లి పుట్టి అంధురాలు, కుటుంబానికి ఎటువంటి పోషణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు
పరస లక్ష్మీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గంజాయి అమ్ముతుంటాడని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఐద్వా పట్టణ కమిటీ సభ్యురాలు బూర భవాని మాట్లాడుతూ ఐద్వా సంఘంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామన్నారు.