నెల్లూరులో శరవేగంగా అభివృద్ధి పనులు

– రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి

నెల్లూరు రూరల్‌, మహానాడు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ వివరాలివి. 20వ డివిజన్, న్యూ కావేరి అవెన్యూ లో షుమారు 10 లక్షల రూపాయల నిధులతో కల్వర్టు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20వ డివిజన్ లో కరెంటు సమస్యలపై అధ్యాయనం చేసి, కరెంటు సమస్యలు లేకుండా చేస్తాం. 20వ డివిజన్ అభివృద్ధికి మరో 2 నెలల్లో 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గా నా లక్ష్యం ఒక్కటే. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడమేనని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కంటే సాయి బాబా, స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్, టీడీపీ నాయకులు దారా మల్లి, షేక్ ఖాదర్ బాషా, పోతురాజు రవి, దిలీప్ రెడ్డి, ఎం.శ్రీనివాసులు, పి.డేవిడ్ రాజా, దామోదర్ (పిచిరెడ్డి), రవీంద్ర రెడ్డి, మురళి రెడ్డి, నారాయణ, కిష్టయ్య, రత్నయ్య, వెంకటేష్, నవీన్, బాల సిద్దయ్య, చేజర్ల కవిత, పద్మజ యాదవ్, అల్లం లక్ష్మి, శాంతి, ఎమ్.సి. సుబ్రహ్మణ్యం, జి. డేవిడ్, దాసు, చికవోలు శ్రీనివాసులు, మధుసూధన రావు తదితరులు పాల్గొన్నారు.