– జిల్లాల నుంచి తాజా లెక్కలతో సమాచారం
` మొత్తం 5,39,189 ఓట్లు పోలైనట్లు వెల్లడి
– ఆయా జిల్లాల్లో కౌంటింగ్ టేబుళ్లపైనా నిర్ణయం
– అత్యధికంగా శ్రీకాకుళంలో 38,865 ఓట్లు
` అత్యల్పంగా నరసాపురంలో 15,320 ఓట్లు
` ఆర్వో సీల్ లేని వాటిని లెక్కించాలని టీడీపీ వినతి
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన లెక్కలతో ఈసీ నుంచి తాజాగా సమాచారం అందింది. మొత్తం 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా మొదటి స్థానంలో శ్రీకాకుళం జిల్లాలో 38,865, రెండో స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283, మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు నమోద య్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలన్న అంశంపై రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమా చారం పంపింది.
ఆర్వో సీల్ లేని వాటిని పరిగణలోకి తీసుకోవాలి
అయితే పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని టీడీపీ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముకేష్‌కుమార్ మీనా మౌఖికంగా అంగీకరించారు. అయితే లిఖితపూర్వ కంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతోంది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని చెబుతోంది. పోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదవడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. గతంలో కంటే ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్లు నమో దు అయ్యాయని, ఇది దేశంలో రికార్డు అని చెబుతున్నారు.