‘వేమూరు’ లో శాశ్వత సభ్యత్వాల నమోదు!

– ఎమ్మెల్యే ఆనందబాబు

వేమూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. రూ.లక్ష చెల్లించి పలువురు నియోజకవర్గ నేతలు శాశ్వత సభ్యత్వం పొందారు. వీరికి మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనంద బాబు సభ్యత్వాన్ని అందించారు. కొల్లూరుకు చెందిన మైనేని మురళీ కృష్ణ, కనగాల మధు సూదన ప్రసాద్, గుమ్మడి శివ, వేమూరుకు చెందిన వేమూరి మురళీ కృష్ణ, అమృతలూరుకు చెందిన గొట్టిపాటి పూర్ణ కుమారి, మోపర్రుకు చెందిన కొడాలి గోపాల కృష్ణ, పల్లెకోనకు చెందిన కైతేపల్లి షాలేం రాజు శాశ్వత సభ్యత్వం తీసుకున్న వారిలో ఉన్నారు. వీరిని నక్కా ఆనంద బాబు అభినందించారు.