అమరావతి, మహానాడు: గత ఏడాది ఖరీఫ్ కరువు, మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రూ.1,289 కోట్ల విలువైన ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించేందుకు ఈ ఏడాది మార్చి 6న సీఎం జగన్ బటన్‌ను నొక్కారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఎన్నికలు ముగిసే వరకు చెల్లింపులు వాయిదా వేయాలని ఆదేశిం చింది. ఎన్నికలు ముగియడంతో కరువు బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.847 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలుపుతూ బడ్జెట్‌ను విడు దల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ట్రెజరీ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. మిచౌంగ్ తుఫాన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిధులు మంజూరు చేయలేదు.