తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల

-మొత్తం 2,62,587 మంది అర్హత
-ఏపీ విద్యార్థులకు తొలి రెండు ర్యాంకులు

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించి న ఈఏపీ సెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 2,62,587 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లో 74.98 శాతం, అగ్రికల్చ ర్‌, ఫార్మా కోర్సుల ఎంట్రన్స్‌లో 89.66 శాతం అర్హత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన విద్యార్థులు సమానంగా ఉన్నారు. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళంకు చెందిన జ్యోతిరా దిత్య మొదటి ర్యాంక్‌ సాధించాడు. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లో 1,00,432 మంది దరఖాస్తు చేసుకుంటే 91,633 మంది హాజరు(91.24 శాతం) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 2,54,750 మంది దరఖాస్తు చేసుకోగా 2,40,618 మంది(94.45 శాతం) హాజరయ్యారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల ఎంట్రన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు మొదటి రెండు ర్యాంకులు సాధించడం విశేషం. అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల ఎంట్రన్స్‌లో ఆలూరి ప్రణీత మొదటి ర్యాంక్‌, విజయనగరానికి చెందిన రాధాకృష్ణ రెండో ర్యాంక్‌ సాధించాడు.