కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి చేసేవి లంగా పనులే
ఆయనపై 56 కేసులు…చట్టసభల్లోకి రానివ్వొద్దు
మోసపోతే గోస పడుతామని ఆనాడే చెప్పాం
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్
నకిరేకల్, మహానాడు : నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం జరిగిన సభకు ముఖ్యఅతిథులుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ మోసపోతే గోస పడుతాం అని చెప్పినం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విచక్షణతో ఓటేయాలి
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విచక్షణతో ఓటయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేసిండు. ధాన్యం బోనస్ విషయంలో మాట తప్పిండు. సన్న వొడ్లకు మాత్రమే బోనస్ అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆరు గ్యారంటీల తో అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు సరైన బుద్ధి చెప్పా లని కోరారు. విద్యుత్ కూడా సరిగా ఇవ్వడం లేదు. ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు ఇస్తుండు. మహిళలకు 2,500 ఇస్తా అని మోసం చేసిండు. నోటిఫికేష న్లు ఇవ్వకుండా జాబ్‌లు ఇచ్చామంటూ అబద్ధాలు అడుతు న్నాడు. 30 వేల ఉద్యోగాలు కేసీఆర్ భర్తీ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ అబద్ధాలు అడుతున్నాడని మండిపడ్డారు.
కాంగ్రెస్ అభ్యర్థిపై 56 కేసులు..చేసేవి లంగా పనులే
బీఆర్‌ఎస్ పట్టభద్రుల అభ్యర్థి రాకేష్‌రెడ్డి విద్యావంతుడు.. కాంగ్రెస్ అభ్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్, అబద్ధాలు ఆడే వ్యక్తి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అమ్మా యిలు పెట్టిన కేసులే పది దాకా ఉన్నాయి. అతను చేసేవి అన్నీ లంగా పనులే.. చట్టసభల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీవో 46ను రద్దు చేసేందుకు మా ప్రభుత్వంలో సిద్ధం చేశాం. దురదృష్టవశాత్తు అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ప్రాసెస్ అంతా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ జీవో రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, భువనగిరి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మల్లేష్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తది తరులు పాల్గొన్నారు.