డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు

గుంటూరు, మహానాడు: నగరంలో వర్షం నీరు డ్రైన్లలోకి మాత్రమే వెళ్ళాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్, రైలు పేట, పొత్తూరి వారి తోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలు గమనించి, తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.