రాజధానిలో అక్రమ లేఅవుట్లు తొలగింపు

గుంటూరు: రాజధాని అమరావతి చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లేఔట్ల పై సీఆర్డీఏ దృష్టి సారించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే ఔట్లపై చర్యలు ప్రారంభించింది. తాడికొండ పరిసరాల్లో చాలామంది పంట పొలాల్ని స్తిరాస్తి వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి లేఔట్లు వేశారు. సీఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండా.. నాలా పన్ను చెల్లించకుండా కూడా కొందరు ప్లాట్లు వేస్తున్నారు. దీంతో సీఆర్డీఏ అనుమతి లేని ప్లాట్ల వద్ద కంచెలు తొలగించారు. రోడ్లు ధ్వంసం చేశారు. ఇలాంటి ప్లాట్లు ఎవరైనా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. అనుమతులు లేని వెంచర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.