జయశంకర్‌ బడిబాట పాఠశాలల పునఃప్రారంభం

పాల్గొన్న మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా: రాయికోడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట పాఠశాలల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా చదువుల తల్లి సరస్వతి దేవి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మంజుశ్రీ జయపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.