ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

– నిపుణుడు కన్నయ్యనాయుడు వెల్లడి

విజయవాడ: వరదలో కొట్టుకువచ్చిన భారీ పడవల వల్ల దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. 67,69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌెంటర్ వెయిట్లు వద్ద మరమ్మతులు పూర్తి చేశారు. మరమ్మతుకు గురైన వాటి స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఇంజినీర్లు ఏర్పాట్లు చేశారు.

ఇంజినీరింగ్‌ నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు కేవలం అయిదు రోజుల లోపే చేశారు. మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు పెట్టారు. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ ఈ మరమ్మతులు చేపట్టింది. రేయింబవళ్ళు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్యనాయుడు ఘనంగా సన్మానించారు. అలాగే మార్గదదర్శనం చేసిన నిపుణుడు కన్నయ్యనాయుడిని ఇంజినీర్లు, అధికారులు సన్మానించారు.

ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి కృష్ణారావు మీడియాతో ఏమన్నారంటే… దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద వేగంగా మరమ్మతు పూర్తి చేశాం. నాలుగు రోజుల్లోనే కీలక పనులను వేగంగా పూర్తి చేశాం. ప్రస్తుతం మరమ్మతులు చేసిన 3 గేట్లూ సమర్థంగా పనిచేస్తున్నాయి. తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ గేట్లను మరమ్మతులు చేసి పంటలను కాపాడటం సంతోషం కలిగించింది. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, ప్రోత్సాహంతోనే వేగంగా పనులు పూర్తిచేశాం. సీఎం చంద్రబాబు ఇచ్చిన సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం మరువలేనిది. నాదీ రైతులతో కూడిన వసుదైవక కుటుంబం. రైతులకు నష్టం జరగకూడదనే రేయింబవళ్లు కష్టపడి పనిచేసి పనులు పూర్తి చేశాం. ఏపీలో లక్షల ఎకరాల్లో పంటను కాపాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. నాకు సహకరించిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి ధన్యవాదాలు.