వెంటనే సమస్య పరిష్కారం
కర్నూలు, మహానాడు : తన దృష్టికి ఏ సమస్య వచ్చినా, ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్. తాజాగా తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరగా, వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు.
కర్నూల్ జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేశ్‌కి మెయిల్ చేశాయి. వెంటనే స్పందించిన లోకేశ్, అధికారులతో మాట్లాడి, ఆ గ్రామానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేశ్‌కు విద్యార్థి సంఘాలు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.