గీత కార్మికులకు రిజర్వేషన్లు అభినందనీయం

– డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు

విజయవాడ, మహానాడు: మద్యం పాలసీపై ప్రకటన చేస్తూ గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టుగా తెలియజేసినందుకు గీత కార్మికుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. 2022 డిసెంబర్ ఒకటో తేదీన జంగారెడ్డిగూడెం లోని దండమూడి వశిష్ట కల్యాణ మండపంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం విచ్చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని గుర్తు చేశారు. గీత కార్మికులకు మద్యం పాలసీలో రిజర్వేషన్ కల్పిస్తానని నాడు ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి, నేడు నేరవేర్చారన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నాటి బీసీల సమావేశ సందర్భాన్ని గుర్తుచేసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గీత కార్మికులు టీడీపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని తెలిపారు.