గుంటూరు, మహానాడు: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు నుంచి డోన్, నరసాపూర్ మధ్య తిరిగే రైళ్లు ఈ నెల 21, 22 తేదీల్లో యథావిధిగా నడవనున్నాయి. 21వ తేదీన రైలు నం. 17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్ ప్రెస్, రైలు నం. 17227 గుంటూరు-డోన్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానున్నాయి. అలాగే 22వ తేదీ నుంచి రైలు నం. 17228 డోన్-గుంటూరు ఎక్స్ ప్రెస్, రైలు నం. 17281 గుంటూరు-నరసాపూర్ ఎక్స్ ప్రెస్ లు యథావిధిగా నడవనున్నాయి.