బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్
హైదరాబాద్, మహానాడు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చేస్తామని వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కుతంత్రానికి తెర లేపారని మండిపడ్డారు. ఒక వర్గం వారి ఓట్ల కోసం బీజేపీపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లను మార్చమని ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయం గా చెప్పినా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
ఫేక్ వీడియోలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరి స్తుందో ప్రజలు గమనిస్తున్నారు. ఫేక్ వీడియోల సృష్టికర్తల మీద కాంగ్రెస్ పార్టీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఢల్లీి పోలీసులు, గుజరాత్ పెద్దలు తెలంగాణ రాష్ట్రం మీద దాడులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఓటుకు నోటులో దొరికిన రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓటుకు నోటు కేసుతో ముడిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చాలని కోరారు.