దొంగల ముఠా నాయకుడు రేవంత్‌

కాంగ్రెస్‌ అభ్యర్థులుగా వారికే టికెట్లు
420 హామీలతో ఓటర్లను మభ్యపెట్టారు
ఓటుతో ఆయనకు పట్టభద్రులు బుద్ధిచెప్పాలి
తీన్మార్‌ మల్లన్న ఒక బ్లాక్‌మెయిలర్‌
విద్యావంతుడు రాకేష్‌రెడ్డిని చట్టసభలకు పంపండి
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌

హైదరాబాద్‌, మహానాడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. 420 హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌ను తిట్టి పబ్బం గడుపుకో వాలని చూస్తున్నారే తప్ప ఈ ఐదు నెలల్లో రేవంత్‌ చేసిందేమి లేదు. ఓటుకు నోటు దొంగ రేవంత్‌ ..దొంగల ముఠా నాయకుడని, అందుకే కాంగ్రెస్‌ అభ్యర్థు లుగా దొంగలనే ఖరారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టభద్రులు ఈ విష యాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి… కేసీఆర్‌ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలను ఇవ్వడం తప్ప రేవంత్‌ చేసిందేమి లేదన్నారు. కేసీఆర్‌ హయాంలో లక్షా 48 వేల ఉద్యోగాలు ఇచ్చాం..మరో 50 వేల ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉంది..2004-14 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చింది 20 వేల ఉద్యోగాలు మాత్రమేనని తెలిపారు.

తీన్మార్‌ మల్లన్న బ్లాక్‌మెయిలర్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు వాస్తవాలు గ్రహించి ఓటు వేయా లని సూచించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అందరినీ కాంగ్రెస్‌ మోసం చేసిందని, ఎమ్మెల్సీ ఉపఎన్నికలో రేవంత్‌ దొంగ మాటలకు ఓట్లతో పట్టభద్రులు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. తమ అభ్యర్థి రాకేష్‌ రెడ్డి బిట్స్‌ పిలానీలో చదువుకున్న విద్యావంతుడు…తీన్మార్‌ మల్లన్న ఎక్కడ చదువుకున్నాడో తెలియదు..ఆయనకు బ్లాక్‌ మెయిలింగ్‌ తప్ప ఏదీ రాదు..శాసన మండలికి మల్లన్న పోతే ఆయన బ్లాక్‌ మెయిలింగ్‌ను ఆమోదించినట్టు అవుతుందని తెలిపా రు. ప్రశ్నించే వారిని ఇష్ట మొచ్చినట్టు తిట్టడమే తీన్మార్‌ మల్లన్న పని. విద్యావంతుడు రాకేష్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సోనియాను రేవంత్‌ బలి దేవత అన్నారు. మరి బలి దేవతను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఎందుకు పిలుస్తున్నారో చెప్పాలని హితవుపలికారు. ఈ సమావేశంలో సీనియర్‌ నాయకు డు ధర్మేందర్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్‌, కడారి స్వామి యాదవ్‌, సంగెం ఉపేందర్‌, బాలెం అవినాష్‌ పాల్గొన్నారు.