ఐదు నెలల్లో రేవంత్‌ మార్క్‌ అవినీతి పాలన

హామీలిచ్చి గాడిద గుడ్డు ఇస్తున్నాడు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు ఇటీ కంపెనీ ల యజమానులు, ఉద్యోగులు బీజేపీలో చేరారు. వరంగల్‌ జిల్లాకు చెందిన దగ్గు విజేందర్‌రావు ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఐదు నెలల రేవంత్‌ మార్క్‌ అవినీతి పాలన అర్థం చేసుకున్నారన్నారు. రూ.3,600 కోట్లతో దాదాపు 200 కి.మీ పొడవున చేపట్టనున్న రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే నిర్వహిస్తోంది. రైల్వేల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌ నేతలకు లేదు. రేవంత్‌ రెడ్డికి మా సవాల్‌…రైల్వేల కోసం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో.. మోదీ వచ్చాక ఎన్ని నిధులు ఇచ్చామో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రజలకు హామీలు ఇచ్చి గాడిదగుడ్డు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు.