రేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు

– అసెంబ్లీ లో ఎందుకు కంచెలు పెట్టారు?
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారు.

మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సీఎం అయ్యాడు ఆయన భాష మారుతుంది అని ఆశించాం. కానీ కేసిఆర్ ను అసభ్య పదజాలం తో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

మాకు మైక్ ఇవ్వాలని అడిగాం కానీ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మమల్ని తిట్టించడానికే సభ నడిపిస్తున్నట్టు ఉన్నారు. దీనిపై అసెంబ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మీడియా పాయింట్ లో మాట్లాడుదాం అంటే పోలీసులను పెట్టీ అడ్డగించారు. కంచెలు తెలంగాణ లో లేవు అంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఇనుప కంచెలు వేసి అడ్డుకున్నారు. ప్రగతి భవన్ ముందు కంచెలు బద్దలు కొట్టామని గొప్పలు చెప్పుకుంది. కానీ అసెంబ్లీ లో ఎందుకు కంచెలు పెట్టారు?