ఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి

– ఢిల్లీలో రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి ఉన్మాద చర్య
– న్యాయం కోసం సీపీ ఆఫీసు మెట్లు ఎక్కాం
– సైబరాబాద్ సీపీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం సందర్భంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి

హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి ఉన్మాద చర్య. భౌతిక దాడులు చేయడం దారుణం. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని సాధించి అభివృద్ది దారిలో నడిపించారు. దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ మీద అతని అనుచరులమీద తక్షణం కేసులు పెట్టాలి. ప్రోత్సహించిన పోలీసులను తక్షణం సస్పెండ్ చేయాలి. అప్పటి వరకు మేము ఇక్కడ కదిలేది లేదు. దాడి చేసిన వారు రాస మర్యాదలతో పోలీస్ స్టేషన్ లో ఉంటే, మేము న్యాయం కోసం సీపీ ఆఫీసు మెట్లు ఎక్కాం. న్యాయం కోసం ఇక్కడ నిరసన చేస్తున్నాం.

ఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

డిల్లీలో రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని రేవంత్ ప్రయత్నం చేశాడు. ఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి. బీహార్ అధికారులపై విమర్శలు చేసింది రేవంత్ రెడ్డి. బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చావు అని గాంధీ, కౌశిక్ ను రెచ్చగొట్టాడు. మేము అందరినీ తెలంగాణ బిడ్డలుగా చూశాం. ఏ అధికారిని అయినా గౌరవించాం. గాంధీ గాడ్సే గా మారారు. రేవంత్ ఎందుకు స్పందించడం లేదు?

దానం నాగేందర్ నీకు దమ్ముందా. ఇంటిని చుట్టు ముడతావా?గులాబీ దండు వల్లే నువ్వు గెలిచావ్ మర్చిపోయావా? తెలంగాణ సమాజం మీద దాడి చేస్తే ఊరుకోం. రేవంత్ రెడ్డి మీరు భయపెడితే మేము భయపడం. ఐదేళ్లలో అధికారంలోకి వచ్చేది మేమే. సీఎం, స్పీకర్, డిజిపి ముగ్గురు స్పందించాలి. స్పీకర్ మాటలకు చేతలకు తేడా ఉంది.