-అటువంటి వెధవ పనులు నేను చేయను
-అధికారులు వారి పని చేసుకుపోతున్నారు
-వారు ముగ్గురూ సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు?
-ఇప్పటివరకు ఆ వ్యవహారంపై సమీక్షించలేదని వ్యాఖ్య
ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు సీఎంగా సమీక్ష జరపలేదు. అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగు తుందో తెలుసు. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇలాంటి విషయాల్లో ఎవరిమాటా వినే వారు కాదు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు… ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చాం. అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్‌ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు బయటపడిరది. వాటికి సంబంధించిన విషయంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఎవరెవరు బాధ్యులో తేల్చే క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహా రం బయటకు వచ్చింది. ఆ తర్వాత కేసులో టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడిరచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కనపడకుండా పోయిన హార్డ్ డిస్క్‌లు, ధ్వంసం అయిన బ్యాకప్ డేటా ఎక్కడ ఉందో విచారణ అధికారులే తేల్చాలి. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపడం లేదు..అటువంటి వెధవ పనులు నేను చేయను. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొ చ్చు. అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్‌ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడుతారు తప్ప.. నాతో కాదు. 1980, 90 నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో, బ్యాకప్ కూడా ఉందో లేదో, దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుంది.