కేసీఆర్ ఇచ్చిన ఉద్ద్యోగాలకి రేవంత్ సభలా ?

– గెల్లు శ్రీనివాస్ యాదవ్

సీఎం రేవంతరెడ్డి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికి ప్రత్యేక కార్యాచరణ ఏమి లేదు 60 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ,

ఇంకా 199940 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ నుండి ఎప్పుడు అనుమతి ఇస్తావో కార్యాచరణ ప్రకటించు ,కానీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు Lb స్టేడియమ్ లో సభ పెట్టుకొని రాజకీయాలు మాట్లాడటం బందు చేయాలనీ కోరుతున్నాం గతంలో కెసిఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఫలితాలతో 16027 పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ ఉద్ద్యోగాలు కేసీఆర్ ఇచ్చినవే అని ఎంపికైన అభ్యర్థులకు తెలుసు

కేసీఆర్ ఇచ్చిన ఫలితాలకు ,సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చి తనే ఇస్తున్నట్టుగా పోజులు కొడుతున్నాడు గతంలో స్టాఫ్ నర్సు ఉద్ద్యోగాలకి సభ పెట్టుకొని రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చాడు ఆ నోటిఫికేషన్ రేవంతరెడ్డి ఇచ్చినది కాదు
కెసిఆర్ ఇచ్చిన నోటిఫికేషన్స్ తానే ఇచ్చినట్టుగా భావించి తనుఇచ్చిన రెండు లక్షల ఉద్దోగాల హామీని మరిచిండు సీఎం త్వరలో ఉద్యోగాల భర్తీ కార్యాచరణ ప్రకటించకపోతే నిరుద్యోగులు వెంటబడి నిలదీసే కార్యాచరణ తీసుకుంటాం