శ్రీశైలం, మహానాడు : ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరిగింది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి 57,171 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 811.50 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.1774 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు.