Mahanaadu-Logo-PNG-Large

జనం ఎదుటే చేపల దోపిడీ

(బహదూర్)

మర్రిపాడు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని పడమటి నాయుడు పల్లి చెరువులో బహిరంగంగానే చేపల చోరీ వెలుగు చూసింది. ఆదివారం మార్కెట్ లో అమ్ముకునేందుకు … ఓ లారీలో చేరిన వ్యాపారులు చెరువులో చేపల వేటను నిర్వహించారు. పంచాయతీ అనుమతి లేకుండా శనివారం అక్రమంగా చేపల వేట సాగించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులు నిద్రావస్థలో జోగుతుండడంతో లక్షలాది రూపాయల పంచాయతీ ప్రజాధనానికి గండి పడుతోంది. ఇలా పట్టిన చేపలను వాహనాలు తరలింంచటానికి వాహనాలను సిద్ధం చేశారు. గ్రామాభివృద్ధికి నిధులను సమకూర్చే చెరువులోని చేపల్ని అనుమతి లేకుండా పట్టటమంటే.. ఇది బహిరంగ చోరీ కింద వస్తుందని, తక్షణం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకొంటున్నారు.